ప్రధాని మోడీకి ఆయనే స్ఫూర్తి: ముఖ్యమంత్రి

by Vemula.Srinu Prasad |

ప్రధాని మోడీకి ఆయనే స్ఫూర్తి అని ఉత్తరాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు..

ప్రధాని మోడీకి ఆయనే స్ఫూర్తి: ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి దూరదృష్టి గల పరిపాలకుడిగా, ప్రజాస్వామ్య విలువల ప్రతీకగా నిలిచారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అటల్ జీ జీవితం దేశభక్తి, మానవీయ విలువలు, సుశాసనానికి ప్రతిరూపమని చెప్పారు. ప్రభుత్వాలు వస్తాయని, పోతాయని కానీ దేశం నిలబడాలని చెప్పిన అటల్ జీ మాటలు యావత్ భారతానికి మార్గదర్శకమని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రతకు పునాదులు వేసిన మహానేత అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ కొనియాడారు.


కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని, వ్యవసాయం, మహిళలు, యువత, ఉపాధి అంశాలపై పార్లమెంటులో సమర్థవంతంగా గళమెత్తిన అభివృద్ధి ప్రధాత అటల్ బిహారీ వాజపేయి అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి హయాంలో ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన, సర్వశిక్షా అభియాన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు వంటి పథకాలు నేటి అభివృద్ధికి పునాదులయ్యాయని తెలిపారు. అలాగే దేశ భద్రత విషయంలో అణు పరీక్షల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిన నాయకుడు వాజ్‌పేయి అని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన మార్గాన్ని నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారని పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.

Next Story