AI Video: ఏపీని సీఎం‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ సందర్శిస్తే..? భారత రైతులా! ఏఐ మాయాజాలం

by Ramesh Naini |   (  Updated:2025-04-18 12:39:07  IST  )

ప్రపంచవ్యాప్తంగా (ఏఐ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విస్తరిస్తోంది.

AI Video: ఏపీని సీఎం‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ సందర్శిస్తే..? భారత రైతులా! ఏఐ మాయాజాలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విస్తరిస్తోంది. క్రియేటర్లు ఈ కృత్రిమ మేధ సాయంతో ఆశ్చర్యపరిచేలా రకరకాల వీడియోలు, ఫోటోలు రూపొందిస్తున్నారు. వాయిస్ క్లోన్‌లు సైతం సృష్టిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు, ఫేమస్ పర్సన్‌లను జోడించి డ్యాన్స్‌లు వేయిస్తున్న వీడియోలు సామాజిక మాద్యామాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దేశంలో సాధారణ రైతులా ఉంటే ఎలా ఉంటాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Video) ద్వారా సృష్టించిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో భాగంగా పొలం గట్ల నడుమ అచ్చమైన రైతుల లుంగీతో ట్రంప్ సైకిల్‌పై గడ్డి మోపు పెట్టుకోని వస్తుంటాడు. ఆవును వెంట పెట్టుకోని రావడం, స్నేహితులతో ముచ్చట్లు, చెట్టు ఎక్కి పూలు తెంపడం, చిన్నారులతో దీపావళి వేడుకలు చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీని సందర్శిస్తే ఎలా ఉంటుందని టీడీపీ సోషల్ మీడియా ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో ఏపీలోని బీచ్‌లో సీబీఎన్, ట్రంప్ కలిసి కొబ్బరి బోండాలు తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటు సీన్, ట్రంప్‌ను కూర్చోబెట్టుకోని చంద్రబాబు సైకిల్ తొక్కుతున్న సీన్, సీబీఎన్‌తో వింధు భోజనం లాంటి సీన్లు ఉంటాయి. ఈ వీడియోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

కాగా, కృత్రిమ మేధతో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తామో, మోసాలకు కూడా ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సైబర్‌ నేరాలు సాధారణ ప్రజలు, సెలబ్రెటీల వీడియోలను తప్పడు పద్దతిలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాధారణ ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ఆస్కారం ఎక్కువగా ఉంది. మన ఫేక్ వీడియోలు, ఫోటోలును క్రియేట్ చేసిన వారిపై సైబర్ పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Click For Tweet Post..

Next Story