తాడిపత్రిలో కలకలం : హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి

by Ramesh Naini |

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మల్లిక అనే హిజ్రా అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

తాడిపత్రిలో కలకలం : హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మల్లిక అనే హిజ్రా అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన మల్లిక.. అదే రోజు రాత్రి చల్లవారిపల్లి రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై విగతజీవిగా కనిపించింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారే పక్కా పథకం ప్రకారం ఆమెను ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లి, దారుణంగా కొట్టి చంపారని తోటి హిజ్రాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

మల్లికను కొందరు ఆటోలో కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హిజ్రాల మధ్య ఉన్న ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి శిరీష, సంగీత, రాధ అనే ముగ్గురు అనుమానిత హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మల్లిక వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story