భారీ వర్షాలు.. శ్రీశైలం జలాశయానికి వరద

by Malleboina Mahesh |

తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు.. శ్రీశైలం జలాశయానికి వరద
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో అన్ని చెరువులు, చిన్నపాటి రిజర్వయర్లు నిండిపోయి వరదలు వస్తున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతుంది. దీనికి తోడు గత ఐదు రోజులుగా కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains in Karnataka) కురుస్తుండటంతో తుంగభద్ర నది(TungaBadra Rivar)కి భారీగా వరద నీరు(flood water) చేరుతోంది. దీంతో కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వరద ఉధృతి పెరిగింది.

ఈ క్రమంలో సుంకేసుల డ్యామ్(Sunkesula Dam)కు భారీ వరద వచ్చి చేరడంతో అప్రమత్తమైన అధికారులు నిన్న సాయంత్రం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఈ నీరు కృష్ణానదిలోకి ప్రవేశించడంతో.. శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) స్వల్పంగా వరద ప్రారంభం అయింది.. దీనికి తోడు కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 21,666 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 816.70 అడుగులకు చేరింది. గత సంవత్సరం భారీ వర్షాలు (Heavy rains) కురవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక సార్లు శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Next Story