- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన : ఏపీ సీఎం
గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా (Unscientific) జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా (Unscientific) జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో (Cabinet Sub Committee) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా (Agenda) సీఎం సమాలోచనలు జరిపారు. గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. దాని వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు కూడా పాలనాపరమైన ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే (Correction) పనిలో ఉందని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల (Revenue Divisions) ఏర్పాటుపై వివిధ వర్గాలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వినతుల గురించి మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు సీఎంకు వివరించారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఉప సంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు.






