- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srikalahasti Brahmotsavam : కేంద్ర మంత్రులకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ఆహ్వానం
ఏపీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Srikalahasti Shwara Brahmotsavam)కు సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) సహా కేంద్ర(Union Ministers), రాష్ట్ర మంత్రులు, ప్రముఖులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(MLA Bojjala Venkata Sudheer Reddy) ఆహ్వాన పత్రిక(Invitations)లు అందచేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Srikalahasti Shwara Brahmotsavam)కు సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) సహా కేంద్ర(Union Ministers), రాష్ట్ర మంత్రులు, ప్రముఖులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(MLA Bojjala Venkata Sudheer Reddy) ఆహ్వాన పత్రిక(Invitations)లు అందచేశారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఇప్పటికే ఆహ్వానించారు.
ఈరోజు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అధికారిక ఆహ్వానం అందజేశారు. అలాగే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు, కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి, భారత మాజీ ప్రధాన మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. దేవెగౌడలకు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగిలకు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా అధికారిక ఆహ్వానం అందించడం జరిగింది. అలాగే గుడిమల్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కూడా సుధీర్ రెడ్డి అందించారు.
అంతకుముందు రోజు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందించారు.






