- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న కేంద్రమంత్రి.. కారణం ఏంటంటే?
జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan naidu) ఇవాళ(గురువారం) పర్యటించనున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan naidu) ఇవాళ(గురువారం) పర్యటించనున్నారు. ఈ క్రమంలో శ్రీనగర్, జమ్ము ఎయిర్‌పోర్టుల్లో భద్రతపై, ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ తరుణంలో గత వారం పాక్ డ్రోన్లు అక్కడి ఎయిర్ పోర్టులపై దాడులకు యత్నించిన క్రమంలో ఆయన భద్రతాపరమైన అంశాలు పరిశీలించనున్నారు. ఇక నుంచి ఆయా ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు తరదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మీకి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పూర్తిగా సహకరించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శ్రీనగర్ నుంచి విమాన రాకపోకలను పునరుద్దరించామని ఆయన తెలిపారు.
Next Story






