- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళం దశ మార్చుతాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లాను వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర నుంచి విముక్తం చేసి, ఉపాధి అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంచేశారు..

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srinkakulam District)ను వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర నుంచి విముక్తం చేసి, ఉపాధి అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minsiter Rammohan Naidu) స్పష్టంచేశారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. సోంపేట మండలం ఎర్రముక్కాంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌తో కలిసి 'మత్స్యసాగర మాల' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా సీఎస్ఆర్ నిధులతో సుమారు 1,594 సోలార్ లైట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మత్స్యకారులు తీర ప్రాంతానికి సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా సిమెంటు రోడ్లు, వెలుగుల కోసం సోలార్ లైట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ 'మత్స్యసాగర మాల' ప్రాజెక్టు జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం మత్స్యకార సంక్షేమమే కాకుండా, పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ముఖ్యంగా మూలపేట పోర్టును కేంద్రంగా చేసుకుని చాలా పరిశ్రమలను రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పోర్టు అనుసంధానంతో కొత్త పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.






