Rammohan Naidu: ఆ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేశాం

by Gantepaka Srikanth |
Rammohan Naidu: ఆ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేశాం
X

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్‌(Union Budget 2025)పై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు(Union Minister Rammohan Naidu) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉడాన్‌ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసినట్లు తెలిపారు. చిన్న రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్టులకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌ అభివృద్ధికి ఉడాన్‌ను వినియోగిస్తామని ప్రకటించారు. నెల్లూరు, కుప్పం, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులకు స్థలాలు చూసినట్లు చెప్పారు. ఫిజిబులిటీ రిపోర్ట్ వచ్చాక ముందుకెళ్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2025-26లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్‌ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు కేటాయింపులు చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు.

Next Story

Most Viewed