చాలా మంది ఎదురుచూపులకు తెర: రైల్వే నోటిఫికేషన్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

by Vemula.Srinu Prasad |

ఏపీ అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, రైల్వే అంశాలపై కేంద్రమంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సులో పాల్గొన్న ఆయన విజన్ 2047 లక్ష్య సాధనలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పాత్ర కీలకమన్నారు...

చాలా మంది ఎదురుచూపులకు తెర: రైల్వే నోటిఫికేషన్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, రైల్వే అంశాలపై కేంద్రమంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సు(Visakhapatnam CII Swarnandhra Conference)లో పాల్గొన్న ఆయన విజన్ 2047(Vision 2047) లక్ష్య సాధనలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) పాత్ర కీలకమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఇందుకు నిదర్శనంగా ఈ నెల 23న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగనుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం అదే..

మరోవైపు విశాఖ రైల్వే జోన్(Visakha Raiway Zone), రైల్వే ఉద్యోగాల భర్తీ అంశాలు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని రామ్మోహనాయుడు తెలిపారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పిన ఆయన రైల్వే బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలపై స్పందించారు. రైల్వే పరిధిలోని సరిహద్దుల అంశంపై పూర్తిస్థాయి చర్చలు ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. కేకే (కొత్తవలస-కిరండూల్) లైన్‌పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story