- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభను తాకిన విమాన టికెట్ చార్జీల మోత.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
విమాన టికెట్ చార్జీలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల విమాన టికెట్ చార్జీల(Airline ticket fares) అంశం దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇష్యూ ఇప్పుడు రాజ్యసభ(Rajya Sabha)ను సైతం తగిలింది. దీంతో రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సైతం రాజ్యసభ, లోక్ సభలు జరిగాయి. అయితే విమాన చార్జీల అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.
దీంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన టికెట్ చార్జీలను నియంత్రిస్తామన్నారు. టారీఫ్ మానిటరింగ్ యూనిట్‌ను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో టికెట్ చార్జీల పెంపు సరికాదని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలు పెంచే పరిస్థితి రాకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విమాన టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఆ స్క్రీన్ షాట్లను ప్రయాణికులు తమకు పంపొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలోనూ టికెట్ ధరలను మానిటరింగ్ చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.






