- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది: సీఎం విజయ్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ భరోసా
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు జోసెఫ్ విజయ్‌కి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి(Tamilnadu Chief Minsiter)గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు జోసెఫ్ విజయ్(Joseph Vijay)కి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, వారి సంక్షేమానికి అంకితమయ్యే విజయ్ పదవీ కాలం దిగ్విజయంగా సాగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విజయ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.
మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది..
‘‘తమిళనాడు ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ అనుసంధానతను (కనెక్టివిటీ) మెరుగుపరిచేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ప్రజల అవసరాలే కేంద్రంగా సాగే మీ పాలన అద్భుతమైన మార్పులకు నాంది పలకాలని కోరుకుంటూ మీకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నా.’’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.






