- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌలు రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది : కేంద్రమంత్రి పెమ్మసాని
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో కౌలు రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కౌలు రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మేడికొండూరు, గుండ్లపాలెంలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో మంచినాయకులను గెలిపించుకుంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ గ్రామమే ఉదాహరణ అన్నారు.
రాష్ట్రంలో పత్తిరైతుల సమస్యలు తెలుసుకుంటున్నామని, కచ్చితంగా రైతులకు సరైన పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, వైసీపీ హయాంలో రాష్ట్రం వైపు ఒక్క కంపెనీ కూడా కన్నెత్తి చూడలేదన్నారు.
Next Story






