గొప్ప ముందడుగు... రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టం: కేంద్రమంత్రి పెమ్మసాని

by Vemula.Srinu Prasad |

మహానాడు వేదికగా 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించడం మహిళా సాధికారత దిశగా గొప్ప ముందడుగు వేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు....

గొప్ప ముందడుగు... రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టం: కేంద్రమంత్రి పెమ్మసాని
X

దిశ, వెబ్ డెస్క్: మహానాడు(Mahanadu) వేదికగా 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రతిపాదించడం మహిళా సాధికారత దిశగా గొప్ప ముందడుగు వేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం సీఎం చంద్రబాబు(Cm Chandrababu) దూరదృష్టికి, మహిళా శక్తి సాధికారత పట్ల తెలుగుదేశం(Telugu Desam) నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భవిష్యత్ నాయకత్వానికి కొత్త దిశ చూపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్‌కి అభినందనలు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతో బలమైన నాయకత్వ నిర్మాణం వైపు తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Next Story