Ap: త్వరలో భారీగా ఉద్యోగాలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-31 09:36:10  IST  )

ఏపీలో త్వరలో భారీగా ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు....

Ap: త్వరలో భారీగా ఉద్యోగాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటి పోతున్నా నిరుద్యోగ సమస్య అనుకున్న మేర తగ్గడం లేదు. 2014-19లో కొంత మేర సమస్యను పరిష్కరించినప్పటికీ.. 2019-2024 వరకు ఈ సమస్య మరింత పెరిగింది. ఉద్యోగాలు లేక యువతీ, యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక పని చేసుకునేందుకు ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకకపోయినా ఏదో ఒక పని చేసుకుంటూ కష్టాలుపడుతూ అక్కడే పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా నిరుద్యోగ సమస్యను చక్కదిగ్గేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) చొరవతో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మెగా డీఎస్సీని నిర్వహించారు. అలాగే కానిస్టేబుల్ జాబులను భర్తీ చేశారు. అంతేకాకుండా పాలనలో ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటు చాటుకుంటున్నారు. రేషనింగ్ విధానంలో కొత్త మార్పులు చేశారు. పేదలకు రేషన్ బియ్యం అందించేందుకు స్మార్డ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజిటింగ్ కార్డు మాదిరిగా కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డును అందజేస్తున్నారు.


ఇందులో భాగంగా గుంటూరు(Guntur)లో నిర్వహించిన స్మార్ట్ కార్డు(Smart Cards)ల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తో కలిసి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Central Pemmasani Chandrasekhar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి లోకేశ్(Minister Lokesh) చొరవతో త్వరలో భారీగా ఉద్యోగాలు వస్తామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, చాలా కంపెనీలను ఆహ్వానించిందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ షాపుల్లో రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు అందజేస్తున్నామన్నారు. 30 రోజులు పాటు రేషన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నమని నాదెండ్ తెలిపారు.

Next Story