కర్ణాటక పోస్టల్ సర్కిల్ పనితీరు భేష్.. పోస్టల్ సర్కిళ్ల పనితీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్ల నెలవారీ ఆపరేషనల్, ఆర్థిక పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

కర్ణాటక పోస్టల్ సర్కిల్ పనితీరు భేష్.. పోస్టల్ సర్కిళ్ల పనితీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్ల నెలవారీ ఆపరేషనల్, ఆర్థిక పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా తమిళనాడు, జార్ఖండ్, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ పోస్టల్ సర్కిళ్ల పనితీరును విశ్లేషించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా పోస్టు వద్ద ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్‌ను మరింత సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. టెక్నాలజీ ఆధారిత విధానాన్ని అనుసరిస్తూ వ్యాపార వృద్ధిని సాధించడంతో పాటు, ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగు పరచాలని సూచించారు.

అలాగే, ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ వనరులను బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో విశేషమైన ఫలితాలు సాధిస్తూ, కొత్త వినియోగదారుల విభాగాల్లోకి విజయవంతంగా విస్తరించిన కర్ణాటక పోస్టల్ సర్కిల్ పనితీరును ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు చేరువగా సేవలు అందించడంలో కర్ణాటక సర్కిల్ చూపిన నిబద్ధత ఇతర సర్కిళ్లకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించారు.

Next Story