Breaking: రాజధానిలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ

by Vemula.Srinu Prasad |

అమరావతి మందడంతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కు నిరసన సెగ తగిలింది....

Breaking: రాజధానిలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) మందడంతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌(Union Minister Pemmasani Chandrasekhar)కు నిరసన సెగ తగిలింది. చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌(MLA Shravan Kumar)తో కలిసి వెళ్లారు. దీంతో రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కేంద్రమంత్రి సానుభూతి తమకు అవసరం లేదని మండిపడ్డారు. రైతులను చంపేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే తమ బావ రామారావు చనిపోయారంటూ ఆయన బావమరిది ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా అమరావతి సీడ్ యాక్సిన్ రోడ్ అలైన్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు అలైన్ మెంట్‌లో మందడంలో 100 మంది ఇళ్లు పోతున్నాయి. దీంతో ఆయా యజమానులతో శుక్రవారం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. రాజధాని కోసం తాము ఇళ్లు కోల్పోతున్నామని, సరైన ప్రాంతంలో తమకు కట్టించి ఇవ్వాలని కోరారు. ఎక్కడో దూరంగా తమకు ఇళ్లు ఇస్తున్నారని మంత్రి నారాయణ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుర్చీలో కూర్చొని ఉండగా రైతుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతికి కారణం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అంటూ బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story