- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీర ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
అభివృద్ధికి రాజమార్గం విద్య ఒక్కటేనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: అభివృద్ధికి రాజమార్గం విద్య ఒక్కటేనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో ఆమె పర్యటించారు. విద్య, క్రీడలపై యువత ఫోస్ చేయాలని, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంత ప్రజలు ఉన్నత చదవులు చదవాలని నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. తీర ప్రాంత ప్రజలకు ఎన్నివేళలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థులు మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని కేంద్రమంత్రి సూచించారు.
అంతకుముందు ఆమె పెదమైనవానిలంక ఉన్నత పాఠశాలను సందర్శించారు. యూనియన్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. టీచర్లతో కొంతసమయం మాట్లాడారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై ఆమె ఆరా తీశారు.
Next Story






