Airbus ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ.. కీలక చర్చలు

by Ramesh Naini |

ఇండియా నేడు ప్రపంచ OEMల వ్యూహాత్మక అవసరాలు, ఇన్నోవేషన్, పెట్టుబడులకు కన్వర్జెన్స్ హబ్ గా ఎదిగిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Airbus ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ.. కీలక చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా నేడు ప్రపంచ OEMల వ్యూహాత్మక అవసరాలు, ఇన్నోవేషన్, పెట్టుబడులకు కన్వర్జెన్స్ హబ్ గా ఎదిగిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం Airbus ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్) వౌటర్ వాన్ వెర్ష్ మరియు జుర్గెన్ వెస్టర్‌మీర్ (అధ్యక్షుడు & MD, ఎయిర్‌బస్ ఇండియా & దక్షిణాసియా) తో ఆయన భేటీ అయ్యారు. భారత MSMEలను గ్లోబల్ ఏవియేషన్ సప్లై చైన్లతో మరింత లోతుగా అనుసంధానం చేయడంపై సానుకూలంగా చర్చించారు. భారత ఏవియేషన్ ఎకో సిస్టమ్ స్వదేశీ విమాన భాగాల తయారీ నుంచి ప్రాంతీయ రవాణా విమానాల దిశగా బలమైన పరిశ్రమగా రూపుదిద్దుకుంటోందని మంత్రి వారికి వివరించారు. Airbus A220 విమానానికి సంబంధించిన అన్ని ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయని వెల్లడించారు.

Next Story