- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగువాడిగా ఎంతో గర్వపడుతున్నా.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. తాజాగా బాలకృష్ణకు కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అర్ధ శతాబ్దం పాటు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ పురస్కారం(Padma Bhushan Award) అందుకుంటున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకవైపు సినీరంగం మరొకపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు చేస్తున్న బాలయ్య బాబుకి పద్మభూషణ్ అందుకోవడం పట్ల ఒక తెలుగువాడిగా ఎంతో గర్వపడుతున్నాను’ రామ్మోహన్ నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.






