స్టీల్ ప్లాంట్‌లో CISF సిబ్బంది తగ్గింపు.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తొలగింపునకు కేంద్రమంత్రి భూపతి రాజు కారణం చెప్పారు..

స్టీల్ ప్లాంట్‌లో CISF సిబ్బంది తగ్గింపు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)లో సీఐఎస్ఎఫ్(CISF) సిబ్బందిని ఇటీవల తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివర్మ(Union Minister Bhupathi Raju Srinivarma) స్పందించారు. స్టీల్ ప్లాంట్ పై భారంగా తగ్గించేందుకే సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. కేంద్రం పాలసీకి విరుద్ధమని తెలిసినా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నష్టాలు లేకుండా భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ సంవృద్ధిగా పని చేస్తోందనే నమ్మకం తమకుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో కేరళ,తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరగబోతోన్నాయని, పొత్తులు అంశం అధిష్టానం పరిధిలో ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Next Story