Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన

by Y. Venkata Narasimha Reddy |

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 18,19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు.

Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 18,19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. 18న ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లికి చేరుకుంటారు. ఆ రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో విందుకు హాజరై.. భేటీ అనంతరం విజయవాడలోని హోటల్ లో బస చేస్తారు. 19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్ఐడీఎం(NIDM) కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్(NDRF) 10వ బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అమిత్ షా పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితలు పాల్గొంటారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి నిధుల సాధనలో భాగంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్న సీఎం చంద్రబాబు ఇదే క్రమంలో అమిత్ షా పర్యటన సందర్భంగా కూడా మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటుండటం విశేషం.

Next Story