- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah: ఏపీకి హామీలు.. హస్తినకు పయనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి పయనమయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Minister Amith Shah) ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీ(AP) పర్యటన ముగియడంతో ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లారు. అయితే అమిత్ షాకు గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సహా కూటమి నాయకులు వీడ్కోలు తెలిపారు. ఏపీలో ఆరు నెలల్లో 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందించినందుకు అమిషాకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అభివృద్ధికి ఎప్పుడూ సహకారం అందించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు కృష్ణా జిల్లా కొండపావులూరు గ్రామంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రాంగణంలో 20వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant), అమరావతి(Amaravati), పోలవరం(Polavaram)పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2028కల్లా పోలవరాన్ని పూర్తి చేసి ఏపీ ప్రజలకు నీళ్లు అందిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.






