Amit Shah: 18న స్పెషల్ విజిట్

by Vemula.Srinu Prasad |

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18న ఏపీకి వస్తున్నారు...

Amit Shah: 18న స్పెషల్ విజిట్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఈ నెల 18న ఏపీ(Ap)కి వస్తున్నారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి కృష్ణా జిల్లా గన్నవరం(Gannavaram) రానున్నాయి. ఆ రాత్రికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నివాసంలో ఏర్పాటు చేయనున్న విందుకు హాజరవుతారు. మరుసటి రోజు(19న) ఉదయం విజయవాడ సమీపం కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ క్యాంపులను సైతం ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Next Story