- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎం లంకలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన
పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నరసాపురం మండలంలోని పెదమైనవాని లంకను (PM Lanka) ఆదివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్ తదితరులున్నారు. అయితే పీఎం లంకను కేంద్రమంత్రి దత్తతకు తీసుకున్నారు. పర్యటనలో భాగంగా పెదమైనవానిలంకలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సముద్రతీరం దగ్గర గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తను దత్తత తీసుకున్న తరువాత మొదటగా పెదమైనవాని లంకకు తాగునీరు అందించామన్నారు. సముద్రం కోత నివారణ పనులు జనవరికి పూర్తవుతాయన్నారు. విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్రమంత్రి అన్నారు. విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు.
కేంద్రమత్రి పర్యటన పట్ల గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి కేంద్రమంత్రి స్వయంగా హాజరు కావడం పట్ల ఆశ్చర్యాన్ని కనబరిచారు. నిర్మలా సీతారామన్ ఆత్మీయత, బాధ్యతాయుతమైన ఆలోచన, అభివృద్ధి పట్ల నిబద్ధత ఆదర్శంగా నిలుస్తాయని స్థానిక నాయకులు పేర్కొన్నారు. కేంద్రమంత్రి సహకారంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా నిబద్ధతతో ఆయ పని చేస్తున్నారని తెలిపారు. పారదర్శకమైన పాలనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు అద్దం పట్టేలా మన్ కీ బాత్ కార్యక్రమం సాగిందని నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






