- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget 2025-26: పోలవరం నిర్మాణ వ్యయ సవరణకు కేంద్రం ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చేప్పంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చేప్పంది.ఏపీకి గేమ్ ఛేంజర్ అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.30,436.95 కోట్లు విడుదల చేయనున్నట్లుగా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు కూడా ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన బకాయిలు రూ.12,157 కోట్లు మేర ఉన్నాయని మంత్రి నిర్మలా తన ప్రసంగంలో వెల్లడించారు. కాగా, గత ఏడాది బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు రూ.15 వేల కోట్లు కేటాయించింది.






