నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం కేసు: ఇద్దరు వైసీపీ నేతల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం కేసులో వైసీపీకి చెందిన ఇద్దరు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం వైసీపీ అధ్యక్షుడు శివ, సుర్లనాయుడు పాత్ర ఉన్నట్లు గుర్తించారు...

నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం కేసు: ఇద్దరు వైసీపీ నేతల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) నర్సీపట్నం(Narsipatnam) సృష్టి క్షేత్రం(Srushti Kshetram) వివాదం కేసు సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా వైసీపీకి చెందిన ఇద్దరు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం వైసీపీ అధ్యక్షుడు శివ, సుర్లనాయుడు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్ ఫిర్యాదుతో స్థానిక టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రం నిర్మాణం తీవ్ర రాజకీయ వివాదంగా మారింది. పెద్ద చెరువు సమీపంలో జరుగుతున్న ఈ నిర్మాణాలను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేపైనా దాడి జరిగింది. దీంతో పోలీసులు ఇరువురుపై కేసు నమోదు చేశారు. తాజాగా చర్యలు చేపట్టారు.

Next Story