పొలంలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవ దహనం

by Vemula.Srinu Prasad |

పొలానికి వెళ్లిన ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. ...

పొలంలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: పొలానికి వెళ్లిన ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా(Nellore)లో జరిగింది. వరికుంటపాడు మండలం బోనిగర్లపాడు(Bonigarlapadu)కు చెందిన ఇద్దరు యువకులు గణేశ్, రమేశ్ బైక్‌(Byke)పై పొలం(Farm) వైపు వెళ్లారు. అయితే పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు బైక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. బైక్ సైతం పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంతో ఉత్సాహంగా కనిపించే యువకులు ఇక లేరని తెలిసి బోనిగర్లపాడు విషాదంలో మునిగిపోయింది.

Next Story