- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవదహనం
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. వారు నిద్రపోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడంతో.. తప్పించుకునే వీలులేక ఆ మంటలకే ఆహుతయ్యారు. మృతులను వలగాని సావిత్రి (60), సిగ పూలమ్మ (65)గా గుర్తించారు. పూలమ్మ ఈ మధ్యే తన చెల్లిని చూసేందుకు సూర్యాపేట జిల్లానుంచి వేలేరుపాడుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మంటలు భారీగా ఎగసిపడటంతో.. స్థానికులు అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. అగ్నిప్రమాదంలో మరో ఇంటికీ మంటలు అంటుకోగా.. పాక్షికంగా దగ్ధమయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






