- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident:బైక్‌ను ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
by Jakkula.Mamatha |
ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నందికొట్కూరు హైవేపై ఈ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. జూపాడుబంగ్లా నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి రోడ్డుకు మరోవైపు వెళ్తున్న ద్విచక్రవాహనం పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైకును కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులు ఎల్లా గౌడ్, రెహమాన్‌గా గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
Next Story






