- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిలో ఇద్దరు అర్చకుల సస్పెన్షన్
by Vemula.Srinu Prasad |
దేవస్థానం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు...

X
దిశ, ఏపీ బ్యూరో: దేవస్థానం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 25 రాత్రి మల్లేశ్వరస్వామి ఆలయంలో మూడో షిఫ్ట్‌లో ఉండాల్సిన ఉప ప్రధాన అర్చకుడు పి.శ్రీనివాస శర్మ విధుల్లో గైర్హాజరు కాగా పరిచారకుడు కె.నాగరాజు కూడా విధుల్లో లేనట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఈవో ఈ విషయాన్ని గుర్తించి, ఇరువురిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో కచ్చితంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు.
Next Story






