- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్గయ్యపేటలో విషాదం.. వడదెబ్బకు ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో తీవ్ర ఎండల ప్రభావంతో ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఈ విషాదం చోటుచేసుకుంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట(Jaggayyapeta) పరిధిలో తీవ్ర ఎండల ప్రభావం(Sun Effect)తో ఇద్దరు వ్యక్తులు వడదెబ్బ(Sunburn)కు గురై ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు లారీ డ్రైవర్ కాగా, మరొక వ్యక్తి కూడా ఎండ తీవ్రత కారణంగానే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
హోటల్‌లో టీ తాగుతున్న సమయంలో..
జగ్గయ్యపేట సమీపంలోని ఒక హోటల్‌లో టీ తాగుతున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అదే ప్రాంతంలో మరో వ్యక్తి కూడా వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story






