- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో ఈతకు వెళ్లి.. ఇద్దరు మృతి
చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు.

మృతులు ఇద్దరూ కనిగిరి పట్టణ వాసులు
ప్రకాశం జిల్లా పునుగోడులో ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో : చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడులో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని నక్కలతిప్పకు చెంది న బొందలపాటి శివప్రసాద్ (19), శంఖవరానికి చెందిన ఏనుగంటి గౌతం (17) ఈ నెల 17వ తేదీ భైరవకోన జలపాతాన్ని చూసేందుకు వెళుతున్నామని ఇంట్లో చెప్పారు. అప్పటినుంచి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. అయితే వారిద్దరూ భైరవకోన వెళ్లకుండా పునుగోడు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఇవాళ మృతదేహాలు చెరువులో తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమా చారం ఇచ్చారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఎస్ఐ టి శ్రీరామ్, తహసిల్దార్ ఏ.వి. రవిశంకర్ సిబ్బందితో చెరువు వద్దకు వెళ్లారు. మృతదేహాలను వెలికితీయించి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం కోసం కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన కనిగిరిలో విషాదం నింపింది






