ఏపీ జైళ్లశాఖ పరువుకు భంగం.. ఇద్దరు అధికారులపై వేటు

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్‌లో జైళ్ల శాఖ పరువుకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏపీ జైళ్లశాఖ పరువుకు భంగం.. ఇద్దరు అధికారులపై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జైళ్ల శాఖ పరువుకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం స్మగ్లర్‌కు (Red Sandle Smugglers) సెల్‌ఫోన్లు అందజేశారన్న ఆరోపణలపై ఇద్దరు జైలు అధికారులను సస్పెండ్‌ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ రమేశ్‌, జైలర్ రఫీపై సస్పెన్షన్‌ వేటు వేసింది. జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. రఫీ ఇటీవల కడప నుంచి అనంతపురం జైలుకు బదిలీ అయ్యారు.

అధికారులపై వచ్చిన ఆరోపణల మేరకు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. స్మగ్లర్ జాకీర్ వద్ద నుంచి అధికారులు 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 3 ఫోన్లు కడప రిమ్స్ పోలీసులకు అప్పగించారు. ఇదే వ్యవహారంలో మునుపు ఐదుగురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కడప జైలులో డీఐజీ రవికిరణ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

Next Story