వేట్లపాలెం పేలుళ్లలో 23కు చేరిన మృతులు.. ఏడుగురి పరిస్థితి విషమం..?

by Vemula.Srinu Prasad |

వేట్లపాలెం విస్పోటనం ఘటనలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. ..

వేట్లపాలెం పేలుళ్లలో 23కు చేరిన మృతులు.. ఏడుగురి పరిస్థితి విషమం..?
X

దిశ, వెబ్ డెస్క్: వేట్లపాలెం విస్పోటనం(Vetlapalem Explosion) ఘటనలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ దాటికి లోపల పని చేస్తున్న కార్మికుల శరీరాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మొత్తం 21 మంది సజీవదహనం చెందగా పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు.

అయితే తాజాగా మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బాణా సంచా కేంద్రంలో మొత్తం 34 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు వేట్లపాలెం ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల పరిస్థితులపైనా ఆరా తీశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story