Breaking:లిక్కర్ స్కాం కేసు.. సిట్ అదుపులోకి మరో ఇద్దరు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-30 11:50:09  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Breaking:లిక్కర్ స్కాం కేసు.. సిట్ అదుపులోకి మరో ఇద్దరు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ మద్యం కుంభకోణం(Liquor scandal) కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా లిక్కర్ స్కాం కేసు(liquor scam case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

అయితే, ఎన్నికల సమయంలో తెలంగాణ(Telangana) నుంచి ఏపీ(Andhra Pradesh) సరిహద్దుల్లోకి రూ.8 కోట్ల 20 లక్షల సొమ్మును బాలాజీ తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ కేసులో బాలాజీ ఏ35, నవీన్ ఏ36 ఉన్నారు. లిక్కర్ స్కాంలో డబ్బులు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, మద్యం కుంభకోణం కేసులో వారిపై అభియోగాలు ఉండడంతో భయంతో వారిద్దరూ ఇండోర్ వెళ్లినట్లు సమాచారం. దీంతో బాలాజీ, నవీన్ కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇండోర్(Indore) నుంచి ఏపీలో వైసీపీ నేత(YCP Leaders)లకు ఫోన్ చేస్తుండడంతో లోకేషన్ ఆధారంగా ఇండోర్‌కు వెళ్లిన సిట్ బృందం.. అదుపులోకి తీసుకుంది. దీంతో లిక్కర్ స్కాంలో అరెస్టుల సంఖ్య మొత్తం 11కి చేరింది.

Next Story