- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం... రూ.200 అడిగితే ఇవ్వలేదని అతికిరాతంగా ఇద్దరి హత్య
రూ.200 అడిగితే ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేసి మృతదేహాలను కాలువలో పడేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ...

దిశ, వెబ్ డెస్క్: రూ.200 అడిగితే ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేసి మృతదేహాలను కాలువలో పడేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పాత నేరస్తులు సాయి శంకర్, మనోజ్ మద్యం మత్తులో రెచ్చిపోయారు. రోడ్డుపై పెన్నా నది వైపు వెళ్తున్న వారిని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ.200 ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. అయితే తమ వద్ద లేవని చెప్పడంతో శివను చంపేశారు. శివను విచక్షణారహితంగా కొడుతుండగా వారిని అటు వైపు వెళ్తూ పోలయ్య అనే వ్యక్తి ప్రశ్నించారు. దీంతో శివ, పోలయ్య ఇద్దరిని చంపి జాఫర్ సాహెబ్ కాలువలో పడేసి పారిపోయారు. కాలువలో మృతదేహాలను గమనించి పోలీసులకు స్థానికుల సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మృతదేహాలను వెలికితీశారు. . మృతుడు శివ స్నేహితులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. శివ, పోలయ్యను బండరాళ్లతో కొట్టి చంపినట్టు నిర్ధారించారు.






