నాలుగు రోజుల క్రితం విద్యార్థినుల మిస్సింగ్.. కొండ గుహపై గుర్తింపు

by Vemula.Srinu Prasad |

అల్లూరి జిల్లాలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు...

నాలుగు రోజుల క్రితం విద్యార్థినుల మిస్సింగ్.. కొండ గుహపై గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లా(Alluri District)లో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. కించూరు(Kinchuru)కు చెందిన 6వ తరగతి విద్యార్థిని వసంత, 5వ తరగతి విద్యార్థిని తేజ పెదబయలు ఆశ్రమం పాఠశాలలో చదువుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా కించూరు గ్రామ శివారు కొండ గుహపై విద్యార్థినిలను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించారు.

Next Story