- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుని నారాయణరావు ఆత్మహత్య.. సోషల్ మీడియాలో ఒకలా.. మీడియా ఎదుట మరోలా స్పందించిన కొడుకు
కాసేపటికే సురేష్ మాట మార్చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. తండ్రి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి..

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తునిలో మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అతను పలుమార్లు బాలికకు తాత వరుస అవుతానని చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయింది. గ్రామస్తులు నారాయణరావుకు దేహశుద్ధి చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్తున్న క్రమంలో కోమటి చెరువులో దూకి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. తండ్రి చనిపోయాడని తెలిసిన వెంటనే శ్రద్ధాంజలి తెలుపుతూ.. తన దృష్టిలో ఎప్పుడో పోయాడని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు అతని కొడుకు సురేష్. దీంతో తండ్రి తప్పు చేస్తే వెనకేసుకు రాకుండా.. అతని తప్పుని యాక్సెప్ట్ చేశావంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
కాసేపటికే సురేష్ మాట మార్చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. తండ్రి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సురేష్.. పోలీసుల అదుపులో ఉండగా ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. పోలీసులు చెబుతున్న దానిపై తమకు అనుమానంగా ఉందని, రాత్రి చనిపోతే ఎందుకు వెంటనే చెప్పలేదని ప్రశ్నించారు. పశ్చాత్తాపంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశాడు సురేష్. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. సోషల్ మీడియాలో ఒకలా, మీడియా ముందు మరోలా రియాక్ట్ అవ్వడంతో.. సురేష్ కు తన తండ్రిపై ఉన్న అభిప్రాయం ఏంటో అర్థంకాని పరిస్థితి. మరోవైపు నారాయణరావు డెడ్ బాడీకి పోస్టుమార్టమ్ పూర్తయినా ఇద్దరు భార్యల్లో ఎవరూ రాకపోవడంతో డెడ్ బాడీని మార్చురీలో ఉంచినట్లు సమాచారం.






