- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: కళ్లు చెదిరే విరాళం
టీటీడీ ట్రస్టులకు కళ్లు చెదిరే విరాళం వచ్చింది. ..

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ట్రస్టుల(TTD Trusts)కు కళ్లు చెదిరే విరాళం వచ్చింది. చెన్నై(Chennai)కు చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ రూ.6 కోట్ల చెక్కులను సమర్పించారు. ఎస్వీబీసీ(SVBC)కి రూ. 5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ S ట్రస్టుకు రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును టీటీడీ అదనపు(TTD Additional EO) ఈవోకు దాత వర్ధమాన్ జైన్ అందజేశారు. వెంకటేశ్వర స్వామి(Lord Venkateswara)ని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని, టీటీడీ ట్రస్టులకు విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
కాగా తిరుమల శ్రీవారిని ప్రతి రోజులు వేలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు. నగదు, బంగారం, వెండి, నగలు, బియ్యం, డాలర్లు వంటి కానుకలు నిత్యం సమర్పిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ వెంకన్నకు వేడుకుంటుంటారు. ఈ కోరికలు తీరడంతో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా ప్రతి రోజు శ్రీవారి ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. భక్తుల దర్శనాలతో వచ్చే కానుకలే కాకుండా ఇలా ట్రస్టులకు వచ్చే విరాళాలు కూడా స్వామివారికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.






