- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను భక్తులకు కేటాయించే విషయం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి.. దర్శన టికెట్ల జారీలో టీటీడీ కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతోంది. వాటిలో 500 దర్శన టికెట్లను మూడునెలలు ముందుగానే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆ టికెట్లలో 500 టికెట్లను మూడునెలలు ముందుగానే ఆన్ లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి ఎయిర్ పోర్టులో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తోంది. మిగిలిన 800 దర్శన టికెట్లలో రూ.10 వేలు విరాళం చెల్లించి వెయిటింగ్ లో ఉన్న దాతలకు.. 300 టికెట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 2025 మే1వ తేదీ నుంచి విరాళాలు చెల్లించిన దాతలకు ఇది వర్తిస్తుందని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విధానం జూన్ 1వ తేదీ నుంచి 2027 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇవి అందుబాటులో ఉంటాయని, సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. అవి బుక్ అవ్వని పక్షంలో కరెంట్ బుకింగ్ కేటాలో టికెట్లను అందుబాటులో ఉంచుతామని టీటీడీ స్పష్టం చేసింది.






