పరకామణి చోరీ నిర్లక్ష్యం టీటీడీదే: హైకోర్ట్

by Muthe.Rajitha |

టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పరకామణి చోరీ నిర్లక్ష్యం టీటీడీదే: హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2023 ఏప్రిల్‌లో టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్ చేసిన చోరీ ఘటనపై విచారణ జరుపుతున్న జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్... ఇది సాధారణ చోరీ కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసం, భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారమని అన్నారు. పరకామణి లెక్కింపులో అక్రమాలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలని, సీసీటీవీలను ఏఐతో అనుసంధానం చేసి హుండీ నుంచి కానుకల ప్యాకింగ్, రవాణా, వేర్పాటు, లెక్కింపును పూర్తిగా ఆటోమేటిక్ చేయాలని సూచించారు.

మాన్యువల్ విధానాన్ని తగ్గించి మెషిన్‌లు వాడితే చోరీలు పూర్తిగా నివారించవచ్చని, 100 మంది చేసే పనిని 10 మందితో చేయవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు టీటీడీ బోర్డే పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం మానేయాలని, సెక్యూరిటీని బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో సీఐడీ, ఏసీబీ దర్యాప్తు నివేదికలను సీల్డ్ కవర్లలో సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story