- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తుల(Tirumala Devotees)కు టీటీడీ బిగ్ అలర్ట్(TTD Big Alert) జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈనెల 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam), 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం(Aniwara Court) కార్యక్రమాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshans) రద్దు చేస్తున్నట్లు TTD స్పష్టం చేసింది.
కాగా తిరుమల స్వామివారి(Tirumala Swami)ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ సమయంలో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఇక కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు జరిగే తేదీల్లో భక్తులు విపరీతంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.






