తిరుమల భక్తులకు గమనిక.. శ్రీవారి దర్శన సమయం ఎంతో తెలుసా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-25 03:40:38  IST  )

తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది..

తిరుమల భక్తులకు గమనిక.. శ్రీవారి దర్శన సమయం ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తుల(Tirumala Devotees)కు టీటీడీ(TTD) బిగ్ అలర్ట్ ప్రకటించింది. క్యూ లైన్ ద్వారా ఈ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు 18 గంటల సమయం పడుతోందని స్పష్టం చేసింది. ఎటువంటి టోకెన్లు లేకుండా క్యూ లైన్‌ ద్వారా కంపార్ట్ మెంట్‌లో వెళ్లి వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని స్పష్టం చేశారు. ఇక గురువారం శ్రీవారిని 58,227 మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 28,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story