శ్రీవారిని దర్శించేందుకు క్యూలైన్‌లోకి వెళ్తున్నారా..?.. మీకో గమనిక..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-04 03:56:02  IST  )

శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక విడుదల చేసింది..

శ్రీవారిని దర్శించేందుకు క్యూలైన్‌లోకి వెళ్తున్నారా..?.. మీకో గమనిక..!
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి భక్తులకు(Srivari Devotees) టీటీడీ(TTD) ముఖ్య గమనిక విడుదల చేసింది. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది. అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూలైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు సమయం పడుతోందని వెల్లడించింది. ప్రస్తుతం కొత్తగా క్యూలైన్‌లోకి వెళ్లే వారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పింది. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని పేర్కొంది.

శనివారం తిరుమల(Tirumala) శ్రీవారిని 84 వేల 113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,868 మంది తలనీలాలు(Tonsures) సమర్పించారు. హుండీ ఆదాయం(Hundi kanukalu) రూ.4.12 కోట్లు వచ్చింది. మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు సుమారు 15 గంటల సమయం పట్టింది. సమయం, స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం 4 నుండి 6 గంటల పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం సుమారు 3 నుండి 4 గంటలు పట్టినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story