- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది..

దిశ, వెబ్ డెస్క్: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగస్టు 8న టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్వేతా భవనంలోని హాలులో సౌభాగ్యం సామాగ్రికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల వారీగా పార్శిల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
వరలక్ష్మీ వ్రతం రోజున టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించారు. విరాళం అందించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు తరలించారు.






