తిరుమల భక్తులకు గమనిక.. శ్రీవారి దర్శనాల సమయం ఎంతంటే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-12 03:17:31  IST  )

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఈ రోజు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది..

తిరుమల భక్తులకు గమనిక.. శ్రీవారి దర్శనాల సమయం ఎంతంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి సర్వదర్శనానికి ఈ రోజు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) ప్రకటించింది. ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్లి కంపార్ట్‌మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 4 గంటలు సమయం పడుతుందని వెల్లడించింది. ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని తెలిపింది. కొత్తగా క్యూలైన్‌లోకి వెళ్లేవారికి 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల రద్దీ‌ని బట్టి సమయాలు మారుతాయని టీటీడీ(TTD) వెల్లడించింది.

కాగా ఆదివారం స్వామివారిని 80,423 మంది దర్శించుకున్నారని, 29,361 మంది తలనీలాలు సమర్పించారని స్పష్టం చేసింది. నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. టోకెన్ లేని భక్తులను 6 గంటల సమయం పట్టిందని, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టిందని టీటీడీ వెల్లడించింది. ఈ సమాచారం మేరకు భక్తులు తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Next Story