- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD : ఎన్నారై..ఎన్నాఆర్టీలకు టీటీడీ శుభవార్త!

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనం కోసంకు వచ్చే ప్రవాస భారతీయుల(NRI, NRTS)కు టీటీడీ(TTD) శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ప్రస్తుతం రోజుకు ఇస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను 50నుంచి 100కు పెంచినట్లుగా టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి ఎన్నారై భక్తుల నుంచి వస్తు్న్న డిమాండ్ దృష్ట్యా ఆ సంఖ్యను 100 మంది భక్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఇకపై శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వంద మందికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కలగనుంది. వీరిలో ముఖ్యంగా వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తిరుమల ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
ఏపీ ప్రభుత్వ జీఏడీ నుంచి వారి కోటా పెంచాలని జనవరి 6న లేఖ రాశారు. ఆ విజ్ఞప్తిపై స్పందించిన టీటీడీ భక్తుల సౌలభ్యం మేరకు నిర్ణయం తీసుకుంది, అలాగే సుపథ మార్గంలో ఎన్నారైలు, విదేశీయులకు సులువుగా దర్శనం కల్పించేందుకు రూ.300 టికెట్ కోటాలో దర్శనం కల్పిస్తున్నారు. భారతదేశానికి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో అధికారులు వేసే స్టాంపింగ్ తేదీ నుంచి 30 రోజులలోపు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయానికి దక్షిణాన ఉన్న సుపథంలో రూ.300 ఎస్‌ఈడీ టికెట్ జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. అయితే బ్రహ్మోత్సవాలు, విశేష ఉత్సవాల సమయంలో ఈ టోకెన్ల జారీ నిలిపివేస్తారు.