- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:తిరుమల దివ్య దర్శనాలపై టీటీడీ ఫోకస్!
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేలాదిగా తరలి వస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేలాదిగా తరలి వస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుంది. అయితే ప్రతి ఏడాది వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రోజురోజుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది కాబట్టి బ్రేక్ దర్శనం లేఖలను నిలుపుదల చేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దివ్య దర్శనం టోకెన్లు విషయం పై టీటీడీ(TTD) ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్రజెంట్ దివ్య దర్శనం టోకెన్ల కోసం అలిపిరి నడక మార్గంలో నిత్యం దాదాపు 8 వేల నుంచి 15 వేల మంది భక్తులు(Devotees) నడిచి వెళ్తున్నారు. గతంలో రెండు మార్గాల్లో అలిపిరి నడక మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల చొప్పున నిత్యం 20 వేల దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేవారు. కొంత కాలం క్రితం గతంలో తరహాలోనే టోకెన్ల జారీ ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ.. దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు మెట్టు మార్గం వరకు వెళ్తున్నారని.. రోజుకు 3 వేల టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని భక్తులు వాపోతున్నారు. దీంతో ప్రస్తుతం రద్దీ వేళ గతంలో అమలు చేసిన విధంగానే రెండు మార్గాల్లోనూ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దివ్య దర్శనం టోకెన్ల పై టీటీడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.






