సుప్రీంకోర్టు సిట్ విచారణకు మేం రెడీ : టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్

by Naga Rani Yarlagadda |

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తప్పు బయటపడటంతో తమపై ఎదురుదాడి చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు సిట్ విచారణకు మేం రెడీ : టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తప్పు బయటపడటంతో తమపై ఎదురుదాడి చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో నెయ్యిని కొనుగోలు చేసిన భోలే బాబా డెయిరీ.. 2018కి ముందు హర్ష్ ఫ్రెష్ డెయిరీగా ఉందని తెలిపారు. భోలేబాబా డెయిరీ గతంలో కూడా నెయ్యి సరఫరా చేసిందన్నారు. ప్రీమియర్ డెయిరీ కూడా చంద్రబాబు హయాంలో నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఈఓ శ్యామలరావు ఎన్డీడీబీ నివేదికలో.. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిపినట్లు పేర్కొన్నారని చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శ్యామలరావుతో.. ఎన్డీఆర్ఐ రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిపినట్లుగా తేలిందని చెప్పించారన్నారు. కల్తీ నెయ్యి కేసులో శ్యామలరావు.. చంద్రబాబుతో చేతులు కలిపి అవాస్తవాలు చెప్పారని వాపోయారు.

సీబీఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టులో ఎలాంటి యానిమల్ ఫ్యాక్ట్ కలవలేదని పేర్కొని.. కోర్టుకు దానిని సమర్పించారన్నారు. కానీ ఇప్పుడు పచ్చమీడియా అంతా.. సిట్, సీబీఐను అలా చేయలేదు, ఇలా చేయలేదని ప్రశ్నిస్తోందన్నారు. ఇప్పుడు కూడా వాళ్లు కోరినట్లే సిట్, సీబీఐ ఎంక్వైరీకి తాము రెడీగా ఉన్నామన్నారు. కానీ.. చంద్రబాబు వేసిన సిట్ తో కాకుండా నిజాయితీగా ఉండే సుప్రీంకోర్టుతో నియమింపబడిన సిట్ అధికారులతో విచారణ చేయిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూమన స్పష్టం చేశారు. ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ, మల్ గంగా కూడా తాను టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టి, నిబంధనలు కఠినతరం చేశాకే టెండర్లు వేశాయని, ఆ డెయిరీల పేర్లు సీబీఐ నివేదికలో పేర్కొందా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని మాట్లాడొద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని భూమన గుర్తుచేశారు.

Next Story